![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -128 లో... సేట్ దగ్గరికి చందు వెళ్లి పది లక్షలు కావాలని అడుగుతాడు. మీ నాన్న తో ఒక మాట చెప్పించు ఇస్తానని సేట్ అంటాడు. డబ్బు గురించి మా నాన్నకి తెలియొద్దని చందు అంటాడు. అప్పుడే రామరాజు సేట్ కి పత్రిక ఇవ్వడానికి వస్తాడు. రామరాజుకి ఎదరుగా సేట్ బయటకు వెళ్తాడు. నా కొడుకు పెళ్లి తప్పకుండా రావాలని రామరాజు చెప్తాడు. వస్తాం ఏమైనా డబ్బు కావాలా అని రామరాజుని సేట్ అడుగుతాడు. వద్దు పెళ్లి కోసం డబ్బు దాచానని రామరాజు అంటాడు.
ఎందుకు అలా అడుగుతున్నారని రామరాజు అడుగుతాడు. ఏదైనా హెల్ప్ చేద్దామని అని సేట్ అంటాడు. ఆ తర్వాత రామరాజు వెళ్ళిపోయాక సేట్ లోపలున్న చందు దగ్గరికి వస్తాడు. డబ్బు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇస్తాను నువ్వు డబ్బు కట్టకపోతే మాత్రం మీ ఇంటికి వస్తానని చెప్పి పది లక్షలు అప్పు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకొని వెళ్లి శ్రీవల్లి చేతిలో పెడతాడు చందు. శ్రీవల్లి థాంక్స్ బా అంటూ హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ డబ్బు భాగ్యం చేతిలో పెడుతుంది శ్రీవల్లి. అల్లుడు గారు నా కూతురికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారని భాగ్యం మురిసి పోతుంది.
మరొకవైపు అందరు షాపింగ్ కి వస్తారు. భాగ్యం తన కుటుంబాన్ని తీసుకొని వస్తుంది. వాళ్ళు రావడం ఫస్ట్ టైమ్ కాబట్టి అన్నీ వింతగా చూస్తుంటారు. మీరు అమ్మాయికి కొనండి.. మేం అబ్బాయికి కొంటామని అని వేదవతితో భాగ్యం అంటుంది. సరే మా అబ్బాయికి నా ఇద్దరు కూతుళ్ళకి తీసుకోండి అని వేదవతి అంటుంది. వాళ్ళ చేత ఎక్కువ రేట్ బట్టలు కొనిపించుకుని వాళ్ళకి తక్కువ రేటు బట్టలు కొనియ్యాలని భాగ్యం అనుకుంటుంది. వాళ్ళు ఏది చూసిన బాలేదని పక్కకి పారేస్తుంది. తరువాయి భాగంలో అందరు కొనుక్కుంటున్నారు. నువ్వు కొనుక్కో అని ప్రేమతో ధీరజ్ అంటాడు. మీ నాన్న అన్న మాటలు ఇంకా గుర్తున్నాయ్.. నీ డబ్బులతో కొనిస్తే కొనుక్కుంటా అని ప్రేమ అనగానే.. నా దగ్గర వెయ్యి పదిహేను వందలు తప్ప ఏం లేవని ధీరజ్ అనగానే వాటితోనే కోనివ్వమని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |